బన్నీ, చెడ్డీ పైనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హౌస్ అరెస్ట్..! 1 d ago
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున కౌశిక్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఫార్ములా ఈ - కారు కేసులో కేటీఆర్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఉదయం 5:30 తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న కౌశిక్ రెడ్డిని బన్నీ, చెడ్డీ పైనే హౌస్ అరెస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.